Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,16,054 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
కన్యాశుల్కం

కన్యాశుల్కం గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం. తెలుగులో తొలి ఆధునిక రచనల్లో ఒకటిగా పేరుపొందింది. కన్యాశుల్కం నాటకం రెండు కూర్పులను రాసి ప్రచురించారు. మొదటి కూర్పు 1897 లో ప్రచురించబడింది. ఈ నాటకం మొట్టమొదటి ప్రదర్శన 1892 ఆగస్టు 13న విజయనగరంలో జరిగింది. అంతకు ముందు 5 సంవత్సరాల క్రితం ఈ రచన జరిగిందని తెలుస్తోంది. అయితే 1909లో ప్రచురించిన రెండవ కూర్పే ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొంది, ప్రజాదరణ పొందిన కన్యాశుల్కం. అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కుమార్తెకు చిన్నతనంలోనే ధనాశతో కన్యాశుల్కం తీసుకుని ముసలివాడైన లుబ్ధావధాన్లకు రామప్పంతులు మధ్యవర్తిత్వంతో పెళ్ళిచేయ నిశ్చయిస్తారు. తన మేనకోడలికి ఆ అవస్థ తప్పించేందుకు అగ్నిహోత్రుని బావమరిది కరటకశాస్త్రి గుంటూరు శాస్త్రులుగా పేరుమార్చుకుని రామప్పంతులు వద్ద ఉంటున్న సహృదయురాలైన సాని మనిషి మధురవాణి సాయంతో తన శిష్యుడికి ఆడవేషం వేసి లుబ్దావధాన్లుకు పెళ్ళిచేస్తారు. గుంటూరుశాస్త్రి కన్యాశుల్కంతో ముందు, మారువేషంలోని శిష్యుడు నగలు, బట్టలతో తర్వాత పారిపోతారు. మరోవైపు గిరీశం అనే మోసగాడు అగ్నిహోత్రావధాన్లు మొదటి కుమార్తె, విధవరాలు అయిన బుచ్చెమ్మను మాయచేసి లేవదీసుకుని పోతారు. వీటన్నిటితో జరిగిన గలాభాలో లుబ్దావధాన్లు, అగ్నిహోత్రావధాన్లు దావాలు తెస్తారు. నిజాయితీపరుడు, సంఘసంస్కర్త అయిన సౌజన్యరావు పంతులు ఈ సమస్యను పరిష్కరిస్తాడు. మధురవాణి సౌజన్యరావు పంతులుకు గిరీశం నిజస్వరూపం తెలియజేయగా, అతనితో బుచ్చెమ్మ పెళ్ళి తప్పించి శరణాలయానికి పంపడంతో నాటకం ముగుస్తుంది. ఇది కన్యాశుల్కంగా ప్రాచుర్యం పొందిన రెండవ కూర్పు కథ. మొదటి కూర్పుకు ఇతివృత్తంలోనూ, పాత్రల స్వరూప స్వభావాల్లోనూ తీవ్రమైన భేదం ఉంది. నాటక రచనా కాలానికి నాటకాల్లో అరుదుగా కానవచ్చే సజీవమైన వాడుక భాషనే నాటక రచనకు వినియోగించుకున్నాడు గురజాడ.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... పంజాబ్ కి చెందిన లాలా హంసరాజ్ దయానంద్ ఆంగ్లో వేద (DAV) పాఠశాల స్థాపకుడిగా ప్రసిద్ధుడనీ!
  • ... టోఫు అనేది సోయా చిక్కుడు నుంచి తయారు చేసే పనీర్ లాంటి పదార్థం అనీ!
  • ... సమరాంగణసూత్రధార భారతీయ వాస్తుశిల్పంపై ఒక విజ్ఞానశాస్త్ర గ్రంథమనీ!
  • ... హిమాచల్ ప్రదేశ్‌ బైజ్‌నాథ్‌ పట్టణంలో దసరా వేడుకలు జరుపుకోరనీ!
  • ... కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఉదయ్ కోటక్, ఆనంద్ మహీంద్రా ప్రధాన వాటాదారులనీ!
చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 3:
ఈ వారపు బొమ్మ
తాడేపల్లి నుంచి ఇంద్రకీలాద్రి, ప్రకాశం బ్యారేజీ దృశ్యం

తాడేపల్లి నుంచి ఇంద్రకీలాద్రి, ప్రకాశం బ్యారేజీ దృశ్యం

ఫోటో సౌజన్యం: iMahesh
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.